
భద్రాచలం కాలినడకన వెళ్తున్న రామభక్తులు
అశ్వారావుపేటరూరల్: ఏపీలోని తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాలకు చెందిన శ్రీరామభక్తులు భద్రాచలానికి కాలినడకన తరలివస్తున్నా రు. దాదాపు ఆరు వేల మంది భక్తులు పాదయాత్రగా వస్తుండగా, వారికి ఆదివారం అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి సమీపంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పలువురు దాతలు భోజనాలు ఏర్పాటు చేశారు. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఆయా జిల్లాల నుంచి రామదండు పేరుతో భక్తులు కాలినడకన భద్రాచలం రామాలయానికి వస్తుంటారు.
ముత్యాలమ్మ తల్లిజాతర ఆదాయం రూ.14.90 లక్షలు
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినా యకపురం శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి జాతర ఉత్సవాల ఆదాయాన్ని ఆదివారం లెక్కించారు. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగిన ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల దుకాణాల ఏర్పాటు, హుండీ ఆదాయం, అమ్మవారి దర్శన టికెట్ల విక్రయాల ద్వారా మొత్తం రూ.14.90 లక్షలు వచ్చాయని ఆలయ ఈఓ సూర్య ప్రకాశ్‌రావు తెలిపారు. కాగా గతేడాది జాతర ఉత్సవాల ద్వారా మొత్తం రూ.13.19 లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.1.71 లక్షలు అదనంగా సమకూరినట్లు చెప్పారు.
బంగారం చోరీ
ఇల్లెందు: పట్టణ పరిధిలోని స్టేషన్ బస్తీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆదివారం వెలు గుచూసింది. ఈ నెల 24న స్టేషన్ బస్తీకి చెంది న శీలం మల్లయ్య భూపాలపల్లిలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లాడు. ఆదివారం తిరి గి ఇంటికి వచ్చి చూడగా.. తాళం పగులకొట్టి, బీరువాలో ఉన్న రూ.10వేల నగదు, 2 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ బి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగదీశ్ కాలనీలో ఆభరణాలు..
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని జగదీశ్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆది వారం వెలుగుచూసింది. కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పని మీద వేరే ఊరు వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తలుపులు, బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వగా, వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పర్ణశాలలో సెల్‌ఫోన్లు..
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో శనివారం అర్ధరాత్రి మూడు స్మార్ట్ ఫోన్లను చోరీ చేశారు. ఆంజనేయస్వామి మాలధారుల ఫోన్లు రెండు, మరో ట్రాక్టర్ డ్రైవర్ ఫో న్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
ముగ్గురిపై కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డుకున్న ముగ్గురు యువకుల పై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్‌ఐ బి.రాజేశ్ కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చింతలబజారులో కాని స్టేబుల్ సంతోష్ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకులు సీహెచ్ సతీష్, గోపి, నర్సింహారావులను అక్కడి నుంచి వెళ్లి పోవాల్సిందిగా సూచించాడు. దీంతో ముగ్గురు యువకులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. విధులను అడ్డుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రెండు బైక్‌లు ఢీ : ముగ్గురికి గాయాలు
మణుగూరుటౌన్: మండలంలోని తిర్లాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బయ్యారాని కి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై మ ణుగూరు వైపు వస్తున్నాడు. అదే సమయంలో ఆ వాహనం వెనుక పెద్దిపల్లికి చెందిన గొత్తి కోయలు ముగ్గురు తమ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో ముందున్న బైక్‌ను ఢీకొని కింద పడటంతో ముగ్గురు గొత్తికోయలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు మణుగూరు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలి యాల్సి ఉందని పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని జగదీశ్ కాలనీ లో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... జగదీశ్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం (22) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడ ని తెలిపారు. కాగా మద్యం మత్తులో ఆత్మహ త్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.