టీఢీపీలో అసంతృప్తి సెగ | - | Sakshi
Sakshi News home page

టీఢీపీలో అసంతృప్తి సెగ

Jun 19 2026 2:24 AM | Updated on Jun 19 2026 2:24 AM

టీఢీపీలో అసంతృప్తి సెగ శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026 కాపు వర్గం దూరం?

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీ కార్యక్రమాలకు హాజరుకాక పోవడం, అంతర్గత అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు పార్టీపై విశ్వాసం కోల్పోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి అండగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు దూరం అవుతుండటం పార్టీ భవిష్యత్తుకే ముప్పుగా మారుతోంది. పట్టణానికి చెందిన ఓ సీనియర్‌ టీడీపీ కాపునేత గత కొంత కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా అసంతృప్తితో నిరసన బాటలోకి వెళ్లడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది.

బాపట్ల

మంత్రి సత్యప్రసాద్‌, ఆయన సోదరుడు

శివప్రసాద్‌ తీరుతో నేతల రాజీనామా

జనసేన నాయకులను

దూరం పెడుతున్న టీడీపీ నేతలు

సొంత సామాజిక వర్గం

నుంచే మంత్రికి వ్యతిరేక పవనాలు

పచ్చ పార్టీకి దూరమవుతున్న

కాపు వర్గానికి చెందిన నేతలు

రేపల్లె: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధ వాతావరణం నెలకొంది. బయటకు కూటమి, అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ లోపల మాత్రం విభేదాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి సత్యప్రసాద్‌, ఆయన సోదరుడు శివప్రసాద్‌ వ్యవహార శైలి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని స్వయంగా టీడీపీ వర్గాలే అంటున్నాయి. వీరిద్దరి వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన పలువురు నాయకులు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్క కుటుంబం చేతుల్లోనే పార్టీ అనే విమర్శలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్థానిక నాయకులను పట్టించుకోకుండా, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకోవడం, తమ అనుచరులకే ప్రాధాన్యం ఇవ్వడం, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని పక్కనబెట్టడంపై నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పే దిశగా కదులుతున్నారు.

నాయకుల రాజీనామాలు

ఇప్పటికే పట్టణ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, 17వ వార్డు ఇన్‌చార్జి మల్లికార్జునరావు రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే విధంగా నగరం మండలం సిరిపూడమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ వీరంకి వీరరాఘవయ్య సహా పలువురు స్థానిక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది కేవలం ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

జనసేనతో దూరం పెరుగుతోందా?

మరోవైపు మిత్రపక్షమైన జనసేన పార్టీతో సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయనే ప్రచారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన నాయకులను పట్టించుకోకపోవడం, కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టడం వంటి చర్యలు కూటమికి బీటలు వారేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే కూటమి బలహీనపడటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సొంత వర్గం నుంచే వ్యతిరేకత

ఇదిలా ఉంటే మంత్రి సత్యప్రసాద్‌కు ఆయన సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, నిర్ణయాలలో ఏకపక్ష ధోరణి కారణంగా ఈ అసంతృప్తి పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక కాపు నేతలతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు అదుపులోకి రాకపోతే పార్టీ మరింత బలహీనపడొచ్చని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.05 టీఎంసీలు. ఎగువ నుంచి 4130 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో రేపల్లె నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చైతన్యం, అవగాహన, పోరాట స్ఫూర్తి పరంగా ఈ ప్రాంతం ముందంజలో ఉంటుంది. ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపిన గొప్ప చరిత్ర రేపల్లె సొంతం. రాజకీయంగా ముదిరిన చర్చలు, సిద్ధాంతపరమైన పోటీలు, ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు ఈ నేల ప్రత్యేకతగా నిలిచాయి. అలాంటి ఘన చరిత్ర కలిగిన రేపల్లె మూడుసార్లు వరుసగా టీడీపీని గెలిపిస్తూ బలమైన కేడర్‌ను నిర్మించుకుంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలంగా పాతుకుపోయిందన్న భావన ఏర్పడింది. అదే సమయంలో పార్టీ ఇప్పుడు విభేదాలకు వేదికగా మారుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యప్రసాద్‌, ఆయన సోదరుడు శివప్రసాద్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement