తెనాలి జిల్లా వైద్యశాలలో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

తెనాలి జిల్లా వైద్యశాలలో విజిలెన్స్‌ తనిఖీలు

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

తెనాలి జిల్లా వైద్యశాలలో విజిలెన్స్‌ తనిఖీలు బ్యాంకు ఉద్యోగుల నిరసన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

తెనాలిఅర్బన్‌: సెకండరీ హెల్త్‌ విభాగ విజిలెన్స్‌ ఉన్నతాధికారి బి.చిన్నకోటయ్య నాయక్‌ ఆధ్వర్యంలోని బృందం సోమవారం జిల్లా వైద్యశాలలో తనిఖీ చేసింది. పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంఆర్‌ఐ, డయాలసిస్‌ విభాగాలను వారు పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యశాల ఆవరణలోని అన్ని విభాగాలను, ఆపరేషన్‌ థియేటర్‌లను పరిశీలించి వివరాలు సేకరించారు. సమయానికి వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించారు. అవసరం లేకపోయిన రోగికి ఎంఆర్‌ఐ స్కాన్‌లు రాయవద్దని, దీనిపై పలు ఫిర్యాదలు అందుతున్నాయని చెప్పినట్లు సమాచారం. డయాలసిస్‌ విభాగంలో అనాధికారికంగా నగదు డ్రా చేశారనే ఫిర్యాదులు రావడంతో వీటిని పరిశీలించేందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బృంద సభ్యుల్లో బయోమెడికల్‌ ఇంజినీర్‌ సందీప్‌, డాక్టర్‌ స్వప్న సింధు, డాక్టర్‌ స్వప్నలు ఉన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.సౌభాగ్యవాణి, ఆర్‌ఎంవో డాక్టర్‌ మల్లిఖార్జునరావు, డాక్టర్‌ మజీద బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఆలిండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఫెడరేషన్‌(ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్‌) పిలుపు మేరకు గుంటూరులోని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ధర్నాచౌక్‌ వద్ద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ యూనియన్‌ అమరావతి సర్కిల్‌–గుంటూరు మాడ్యూల్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న పోరాట ఆవశ్యకతను వారు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ స్టాఫ్‌ యూనియన్‌ అమరావతి సర్కిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీఎస్‌ఆర్‌ సుధాకరరావు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీలు వి.నరేంద్ర కుమార్‌, పీఎస్‌ రంగసాయి, షేక్‌ ఇబ్రహీం, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) నాయకులు కిషోర్‌, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, పావని, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.రాజేష్‌ ఖన్నా, వీరితో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్‌ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. సోమవారం ఏసీ కళాశాల సమవేశ మందిరంలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి వసతితోపాటు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా చూడటంతోపాటు ప్రతి గదిలో ఫ్యాన్లు పని చేయాలని స్పష్టం చేశారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని, ఎటువంటి పొరపాట్లు జరిగినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌బాషా వర్‌ుచ్యవల్‌ విధానంలో పలు సూచనలు చేశారు. సమావేశంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సైమన్‌ విక్టర్‌, ఓఎస్డీ రమేష్‌, ఆర్‌ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు కె.సుచరిత, శిరిల్‌ పాల్‌, బీజే రామారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement