జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలకు సంబంధిత శాఖల పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపగా, కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. మొత్తం 197 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఇకనుంచి ప్రతిరోజు, వారానికి, నెల రోజులకు దశలవారీగా పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలు జరుగుతాయన్నారు. మండల స్థాయి అధికారులంతా ప్రతి సోమవారం మండలాలలో జరిగే పీజిఆర్‌ఎస్ లో హాజరుకావాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ నేటికీ మొదలుకాని ప్రాంతాలలో వేగంగా ప్రారంభించాలని సూచించారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ఎల్.ప్రభాకరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో హుండీల ద్వారా రూ.3,35,87,555 నగదు, 232 గ్రాముల బంగారం, 4.200 కిలోల వెండి లభించాయని ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 1,174 యూఎస్‌ఏ డాలర్లు, 53 ఖతార్ రియాల్స్, 117 మలేషియా రింగట్స్, 175 యూఏఈ దిర్హమ్స్, 300 ఓమన్ బైంసాలు, 1000 ఉగాండా షిలింగ్స్‌తో పాటు పలు దేశాల కరెన్సీ లభించింది. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.


