రాములోరి పురాతన నాణేలు | - | Sakshi
Sakshi News home page

రాములోరి పురాతన నాణేలు

Mar 28 2026 7:39 AM | Updated on Mar 28 2026 7:39 AM

కారంచేడు: వివిధ దేశాలకు, ప్రాంతాలకు చెందిన నాణాలు, కరెన్సీ, స్టాంపులు వంటివి సేకరించడం అతని హాబీ. దీనిలో భాగంగా రాముని పరిపాలనా సమయంలో వినియోగించిన నాణేలను కూడా ఆయన సేకరించాడు. శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆయన ఈ నాణేలను కారంచేడు కల్యాణ మండపం వద్ద ప్రదర్శనగా ఉంచాడు. వీటిని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వాటిని తిలకించి సీతారాములను పూజించుకుంటున్నారు. మండలంలోని ఆదిపూడి గ్రామానికి చెందిన కాలవ రఘురామయ్య 20 ఏళ్లుగా పురావస్తు వస్తువులు సేకరిస్తున్నట్లు తెలిపారు. 1762వ సంవత్సరంలో ‘యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లండన్‌ ఈస్ట్‌ ఇండియా’ సంస్థ తయారు చేసి వాడుకలోకి తీసుకొచ్చిన 250 గ్రాముల బరువుతో 2.50 పైసల నాణెంపై ఒకవైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్‌ ఇండియా సింబల్‌ను ముద్రించారు. 1818వ సంవత్సరంలో ముద్రించిన నాణెంపై ఒక వైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్‌ ఇండియా సింబల్‌తో పద్మం ఉండే విధంగా తయారు చేశారు. దీని బరువు 150 గ్రాములు ఉంది. వీటిని సేవరించి తన ఖజానాలో భద్రపర్చడం జీవితంలో మర్చిపోలేని సంఘటని రఘరామయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement