కనుల విందుగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
బాపట్ల: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస సేవా సమితి త్యాగరాయనగర్ ఆధ్వర్యంలో ఉదయం నిత్య కళ్యాణం మహోత్సవం నిర్వహించారు. కళ్యాణం తలంబ్రాల సందడి, ఎదురుకోలా విశ్రాంతి సేవ, శాంతి హోమం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామి గరుడోత్సవం జరుగుతుందని అర్చక స్వాములు రమేష్, శ్రీనివాస సేవాసమితి తెలిపింది.
తెనాలి: తెనాలి ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ బాధ్య తలు చేపట్టారు. తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతు చేపట్టారు. దీనితో ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
క్వారీ తిరునాళ్లపై సమీక్ష
స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్‌స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డివిజనులోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ ఈవో హాజరయ్యారు. ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తో కో–ఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను తాడేపల్లి పోలీసులు సీజ్ చేసి శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని ప్రాంతం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వస్తున్న ఈ రెండు లారీలను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ అపర్ణ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
15వ వర్థంతి సభలో వక్తల నివాళి
నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ తదితరులు మాట్లాడారు.
వైఎస్సార్ సీపీ యడ్లపాడు అధ్యక్షుడు
వడ్డేపల్లి నరసింహారావు
యడ్లపాడు: బోయపాలెం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనార్థం వచ్చిన మాజీ మంత్రి విడదల రజినిపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడాన్ని వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి దాడికి సంబంధించిన వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీనేత, మాజీ మంత్రి, ఓ మహిళ అనే విచక్షణ మరిచి టీడీపీ శ్రేణులు ఆమె కారును అడ్డుకుని గ్రామంలోకి రాకుండా దౌర్జన్యానికి దిగడంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రజినిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రసాదంపై చేసిన విషప్రచారానికి సిగ్గుపడాల్సింది పోయి, వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్న వారిపై దాడికి యత్నించడం దారుణమన్నారు. ఘటనపై యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని వదలబోమని, తమకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాడతామన్నారు.
కనుల విందుగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
కనుల విందుగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం


