ప్రత్యేక వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేయాలి
బాపట్ల: ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనపై వివిధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా విరాళాలు ఇవ్వడానికి, వారి కార్యాలయంలో అవసరమైన ఫర్నిచర్ పొందడానికి ఒక వేదికగా ఈ వెబ్‌సైట్ నిలుస్తుందని చెప్పారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తామన్నారు. తమ కార్యాలయాలలో ఫర్నిచర్, లేదా కంప్యూటర్లు, లేదా కుర్చీలు, ప్రింటర్లు, వంటివి అవసరమైతే ఆ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. అది చూసిన వారెవరైనా సహకరించవచ్చన్నారు.
గుంతలు రహిత రహదారులు
నిర్మాణం చేపట్టాలి
గుంతలు రహిత రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు వడివడిగా కొనసాగించాలని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.
24 కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలి
గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రజలకు గుర్తుండే విధంగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఈనెల 24వ తేదీ కల్లా 77వ గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


