కలెక్టరేట్‌లో పర్యాటకశాఖ కార్యాలయం ప్రారంభం
బాపట్ల: జిల్లా కలెక్టరేట్‌లో పర్యాటకశాఖ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారి షేక్ అలి అస్గర్ పేర్కొన్నారు. జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన షేక్ అలి అస్గర్ నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఇకనుంచి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మరింత వేగంగా, క్రియాశీలంగా ముందుకు వెళ్తాయని చెప్పారు. పర్యాటకశాఖ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో పర్యాటకశాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ శాఖకు అధికారితోపాటు మరో ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, కుర్చీలు, టేబుల్స్, ప్రింటర్లు సమకూర్చామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యాటకులు, జిల్లాలోని ప్రజలు ఎవరికై నా ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా పర్యాటక శాఖ అధికారిని సంప్రదించవచ్చన్నారు. పర్యాటక శాఖ అధికారి ఫోన్ నెంబర్: 63023 79835ను ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో కాల్ చేయవచ్చన్నారు. సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్‌ల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ప్రాచుర్యంలోకి రానుందన్ని చెప్పారు. కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.


