బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jan 5 2026 8:14 AM | Updated on Jan 5 2026 8:14 AM

బాపట్

బాపట్ల

సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026 మారిషస్‌లో తెలుగువారు భేష్‌

న్యూస్‌రీల్‌

ప్రభుత్వం నుంచే రాలేదు

ప్రభుత్వం ద్వారా ప్రస్తుతానికి బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి కేటాయిస్తేనే కార్డుదారులకు అందించగలం. ఎంఎస్‌ఎల్‌ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్‌ దుకాణాలకు పంపించాం. గోధుమపిండి జిల్లా ప్రధాన కేంద్రంలోనే ఇస్తున్నాం.

ఉగాది ఊసే లేదు

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

నిత్యాన్నదానానికి విరాళం

సాగర్‌ నీటిమట్టం వివరాలు

సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026

వాటి మేళవింపుతోనే లోక కల్యాణం

ఉత్తరాఖండ్‌ ఆది శంకరాచార్య

పీఠం ఉత్తరాధికారి

మూడో ప్రపంచ తెలుగు

మహాసభల్లో అనుగ్రహ భాషణం

గుంటూరు ఎడ్యుకేషన్‌: భాష, సంస్కృతుల మేళవింపుతో లోక కల్యాణానికి కృషి చేయాలని ఉత్తరాఖండ్‌లోని జగద్గురు ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్‌ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్‌ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్‌ సిటీలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సభలో ఆయన దివ్య అతిథిగా పాల్గొన్నారు. జగద్గురు ఆది శంకరాచార్య ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా పర్యటించారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం, భాష ఎక్కడైతే మనుగడ సాగిస్తాయో అక్కడ జీవన విధానం వెల్లివిరుస్తుందన్నారు. వసుదైక కుటుంబ భావనతో ప్రజలు కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అప్పుడే లోక కల్యాణం సాధ్యపడుతుందన్నారు. దేశంలో ఎక్కడ పుట్టినా అంతా ఏకమనే భావన రావాలని చెప్పారు. కేరళలోని కాలడిగిలో జన్మించిన జగద్గురు ఆది శంకరాచార్య దేశం మొత్తం ఒక్కటనే భావన తెచ్చేందుకు నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను స్థాపించారని అన్నారు. ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించి, ముందుకు వెళ్లేవారికి దైవం అండగా ఉంటుందని చెప్పారు. భాషను రక్షించుకోవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. దేశం ఆధ్యాత్మికంగా విశ్వగురువుగా నిలిచిందని, గోవులను రక్షించుకోవడం మన జీవన విధానంలోనే ఉందన్నారు. తల్లిని దైవంగా భావించుకునే గొప్ప సంస్కృతి, ఋషుల ద్వారా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం, గొప్ప పుణ్యనదులు దేశానికి తరగని సంపద అని అన్నారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మారిషస్‌లో తెలుగు ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారని చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో బోధన కోసం పోరాటం చేస్తుండగా, మారిషస్‌లో కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన ఉందని చెప్పారు. మాతృభాష పరిరక్షణపై ప్రజలతోపాటు ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరమ్‌ బీర్‌ గోకుల్‌కు భారత మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

7

– శ్రీలక్ష్మి,

సివిల్‌ సప్లైస్‌ డీఎం, బాపట్ల

శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను జరుపుకొన్నంత ఆనందంగా ఉగాదిని జరుపుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహించడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగులో విద్యాబోధన చేయించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. జయసూర్య, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌, ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, తెనాలికి చెందిన శిల్పి రామలింగేశ్వరరావు, మెట్రో ఇండియా చైర్మన్‌ సీఎల్‌ రాజమ్‌, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 3,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 40.3045 టీఎంసీలు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయ అన్న ప్రసాద వితరణకు ఒంగోలుకు చెందిన ప్రసాద్‌, లక్ష్మి, శివకృష్ణలు ఆదివారం రూ.లక్ష విరాళమిచ్చారు.

విజయపురిసౌత్‌: నాగార్జుసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 560.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 18,678 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

బాపట్ల1
1/8

బాపట్ల

బాపట్ల2
2/8

బాపట్ల

బాపట్ల3
3/8

బాపట్ల

బాపట్ల4
4/8

బాపట్ల

బాపట్ల5
5/8

బాపట్ల

బాపట్ల6
6/8

బాపట్ల

బాపట్ల7
7/8

బాపట్ల

బాపట్ల8
8/8

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement