రైల్వే గేటులో సాంకేతిక లోపం
అర్ధరాత్రి మరమ్మతులు చేసిన సిబ్బంది
తెనాలిరూరల్: తెనాలి–చైన్నె రైలు మార్గంలో పట్టణ మారిస్‌పేటలోని మద్రాసు గేటుగా పిలువబడే రైల్వే గేటులో మంగళవారం రాత్రి పొద్దుపోయాక సాంకేతిక లోపం ఏర్పడింది. కొంత కాలం క్రితం ఎలక్త్రిక్ గేటును ఇక్కడ ఏర్పాటు చేశారు. పట్టాలకు ఇరువైపులా ఉండే గేట్లలో ఒక గేటు మాత్రమే తెరుచుకుంటోంది. గేటు వేయాల్సి వచ్చినా గేటు మ్యాన్ పరుగుపెడుతూ వచ్చి మాన్యువల్‌గా గేటును దించాల్సి వచ్చింది. అలానే తీయాల్సి వచ్చిన మాన్యువల్‌గా తీశారు. అర్ధరాత్రి వేళ సాంకేతిక లోపం ఏర్పడగా, సాంకేతిక నిపుణులు వచ్చి సుమారు గంటన్నరపాటు శ్రమించి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గేటుకు మరమ్మతులు చేశారు. రాత్రి వేళలో వాహన రాకపోకలు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడలేదు.
తెనాలి: భారతర్న అటల్ బిహారీ వాజపేయి ఎంతటి క్లిష్ట సమస్యనైనా తన వాగ్దాటితో, మేధోసంపత్తితో పరిష్కరించడమే కాకుండా విదేశాంగ విధానాన్ని కొత్తపుంతలు తొక్కించి భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేశారని బీజేపీ సీనియర్ నేత తమిరిశ అనంతాచార్యులు చెప్పారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా రూరల్ మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ పాఠశాలో ఏర్పాటు చేసిన సభకు బీజేపీ నాయకుడు కడియాల నందకిషోర్ అధ్యక్షత వహించారు. వాజపేయితో ప్రత్యక్ష పరిచయమున్న తమిరిశ అనంతా చార్యులు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కనగాల తదితరులు ప్రసంగించారు.
తెనాలి: అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సర్వేలపై ఆధారపడి ఉన్నందున సర్వేలను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కుసుమ శ్రీదేవి ఆదేశించారు. మండల, పట్టణ జీఎస్‌డబ్ల్యుఎస్ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక పరిపాలనలో అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసి, చక్కని సేవలు అందించటానికి త్రీటైర్ విధా నంలో మండల, మున్సిపాలిటీ స్థాయిలో నియమితులైన అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
పాల్గొన్న వివిధ రంగాల పట్టణ ప్రముఖులు
తెనాలి: పట్టణ సరిహద్దుల్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వివిధ రకాల శిల్పాలు, ఆర్ట్ గ్యాలరీ కార్యక్రమాలతో కూడిన 2026 సంవత్సర క్యాలెండర్లను బుధవారం పట్టణానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు ఆవిష్కరించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 2025 సంవత్సరంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు, గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలలు, ఐరన్ స్క్రాప్‌తో రూపొందించిన విగ్రహాలతో వేర్వేరుగా రూపొందించిన మూడు క్యాలెండర్లు ఇందులో ఉన్నాయి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, డబుల్‌హార్స్ మినపగుళ్లు సీఎండీ మునగాల మోహన్‌శ్యాంప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి తహశీల్దార్ కేవీ గోపాలకృష్ణ, సినీ దర్శకుడు దిలీప్ రాజా, గణేష్ యూత్ వీరవల్లి మురళి, అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
రైల్వే గేటులో సాంకేతిక లోపం


