విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ఏఎన్‌యూ(పెదకాకాని): ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఏఎన్‌యూ శాఖ అధ్యక్షుడు పి.హేమంతరామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ 44వ రాష్ట్ర మహాసభలలో తీర్మానాలపై ఆమోదంపై బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్నారు. విశ్వవిద్యాలయాలు పరీక్షల పూర్తయి ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా, విద్యార్థుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిన ఘనత రాష్ట్ర విశ్వవిద్యాలయాలదేన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


