అమరజీవి త్యాగం మరువలేనిది
గుంటూరు ఎడ్యుకేషన్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు నిర్మల భారతి, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీ పరిధిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రికల్ మెషీన్స్ ల్యాబ్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ త్వరలోనే యూనివర్సిటీలో సోలార్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యా, పరిశోధన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి జాతీయ స్థాయి పెన్షనర్ అదాలత్ ఉపయోగపడుతుందని డీఆర్‌ఎం సుథేష్ణసేన్ పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో జాతీయస్థాయిపెన్షన్ అదాలత్ కార్యాక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గుంటూరు డివిజన్ ముందుండి పనిచేస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం అదాలత్‌లో 19 ఫిర్యాదులు నమోదు కాగా, సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో 10 ఫిర్యాదులు వేదిక వద్దనే పరిష్కరించారు. మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను డీఆర్‌ఎం ఆదేశించా రు. ఏడీఆర్‌ఎం, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం సీఈ ఆలపాటి శివప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 1044 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 755 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎల్‌ఎల్‌బీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 550 మంది హాజరు కాగా వారిలో 479 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 లోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ. 2070 చొప్పున చెల్లించాలన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ ఆన్సర్ బుక్‌లెట్ ఫీజు రూ. 2190 చెల్లించాలని తెలియజేశారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
అమరజీవి త్యాగం మరువలేనిది
అమరజీవి త్యాగం మరువలేనిది


