పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
బాపట్ల: భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో జరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రోజుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంత రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పల్స్‌పోలియోను విజయవంతం చేయాలి
పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో విడుదల చేశారు. 22, 23వ తేదీలలో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కల మందు వేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించిన 17 వైద్యశాలలకు జిల్లా కలెక్టర్ అవార్డులను ప్రదానం చేశారు. సంబంధిత వైద్యాధికారులు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


