ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

Dec 16 2025 4:33 AM | Updated on Dec 16 2025 4:33 AM

ఆదర్శ

ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం స్థానిక కలెక్టర్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్డ్‌ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్‌, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ యు.చెన్నయ్య, జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, డిఎస్‌ఓ పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్‌.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అధికారులు సమర్థంగా విధులు నిర్వహించాలి

మంగళగిరి టౌన్‌: పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో సమర్థంగా బందోబస్తు విధులు నిర్వహించాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌లో నిర్వహించనున్న కానిస్టేబుల్‌ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై సోమవారం అధికారులకు సిబ్బందికి ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సూచనలు చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని సందర్శించి సీసీ కెమెరాల అమరికలు, పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు రమణమూర్తి, రవికుమార్‌, హనుమంతు, స్పెషల్‌ బ్రాండ్‌ డీఎస్పీ శ్రీనివాసులు, నార్త్‌ డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వడ్డేశ్వరం విద్యార్థులు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని వడ్డేశ్వరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రగ్బీ సౌత్‌జోన్‌ ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్ర సబ్‌జూనియర్‌ బాలికలు అండర్‌–15 విభాగంలో గుంటూరు కొత్తపేటలో ఎంఆర్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ మీడియం జూనియర్‌ క్యాంపస్‌లో ఈనెల 14వ తేదీన ఎంపిక పోటీలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేగావత్‌ భువనేశ్వరి భాయి ఎంపికై ందని తెలిపారు. ఎంపికై న విద్యార్థిని ఈనెల 27, 28 తేదీల్లో చైన్నె జేఎన్‌ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా సౌత్‌జోన్‌ అస్మిత లీగ్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలియజేశారు. అలానే కృష్ణాజిల్లా, గన్నవరంలో ఈనెల 1, 2 తేదీల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అండర్‌–14 విభాగంలో తమ పాఠశాల విద్యార్థిని రావిపాటి దివ్య(8వ తరగతి) ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై ందని వివరించారు. రావిపాటి దివ్య ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొనన్నుట్లు ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణులను, వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, పి.సతీష్‌కుమార్‌లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి 1
1/1

ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement