బాబు మాటల్లోనే బ్యాగోగులు!
న్యూస్‌రీల్
చంద్రబాబు సర్కారు ఇచ్చిన నెలకే పాడైపోయిన స్కూల్ బ్యాగులు మూడు నెలల్లోపే 90 శాతం చినిగిపోయిన వైనం సొంతంగా కొత్త బ్యాగులు కొనుగోలు చేయలేక అవస్థలు నాసిరకం బ్యాగుల పంపిణీపై తల్లిదండ్రుల ఆగ్రహం ఆర్థికభారమైనా కొత్తవి కొనక తప్పడం లేదని ఆవేదన జిల్లాలో మొత్తం 87 వేల బ్యాగుల పంపిణీ
నాడు అన్నీ పరిశీలించాకే..
బాపట్ల
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
ఫిరంగిపురం: మండల పరిధి వేమవరం గ్రామంలోని కోటి ఒక్కలింగాల క్షేత్రంలోని మరకత లింగానికి ఆదివారం వైభవంగా అన్నాభిషేకం నిర్వహించారు. భక్తుల నుంచి సేకరించిన, వంటశాలలో సిద్ధం చేసిన వంద కిలోల అన్నాన్ని వినియోగించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దిగువకు 3,200 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.3253 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 573.40 అడుగులకు చేరింది. ఇది 265.1042 టీఎంసీలకు సమానం.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు పాడైపోయాయి. జిప్పులు పనిచేయడం లేదు. కొన్ని బ్యాగులు పూర్తిగా చినిగిపోయాయి. కుట్లు వేసుకొని వాడదామన్నా బ్యాగులు చీలికలు పేలికలుగా మారడంతో సాధ్యం కావడం లేదు. మూడు నెలలు గడవకుండానే బాబు ఇచ్చిన బ్యాగులు మూలన పడేసి కొత్తవి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది పేదలకు ఆర్థిక భారంగా మారింది. బ్యాగులు కొనుక్కోలేని పేద విద్యార్థులు చినిగిన బ్యాగుల్లోనే పుస్తకాలను మోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నాసిరకం బ్యాగులు ఇవ్వడంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో నాణ్యమైన బ్యాగులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
పేద విద్యార్థులకు కష్టాలు
కొల్లూరులోని లూథరన్ చర్చి ప్రాంతానికి చెందిన చెందిన సీహెచ్ మహిరాజు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ నెలలో సూల్ బ్యాగు ఇచ్చింది. నెల తిరక్కుండానే బ్యాగు కుట్ల వెంబడి చినిగిపోయింది. పుస్తకాల బ్యాగును సైకిల్ వెనుక ఉన్న క్యారియర్‌పై పెట్టుకొని బ్యాగులోంచి పుస్తకాలు పడిపోకుండా చూసుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. బాపట్ల పట్టణంలోని భీమవారిలెంకు చెందిన సీహెచ్ చరణ్ బాపట్ల పట్టణంలోని ఏవీవీ పాఠశాలలో 8వతరగతి చదువుతున్నాడు. పాఠశాలలు ప్రారంభమైన నెలకే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగు చిరిగిపోయింది. ఆ బ్యాగులోనే పాఠశాలకు పుస్తకాలు తీసుకెళ్లి చదువుకోవడం ఇబ్బంధిగా ఉందని చరణ్ చెప్పారు. బాపట్ల పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ కాలేషా మున్సిపల్ పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం జూన్‌నెలలో బ్యాగు ఇవ్వగా ఆగస్టు నాటికి అది చినిగిపోయింది. ఒకటి రెండు సార్లు కుట్టించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కొత్తబ్యాగు కొనుక్కొని స్కూల్‌కు వెళుతున్నట్లు కాలేషా తెలిపాడు. కొల్లూరు మండలం గాజుల్లంకకు చెందిన కన్నారాజు కొల్లూరు బాలురోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగు చినిగిపోయింది. ఆ బ్యాగులో పుస్తకాలు మొత్తం పట్టకపోవడంతో గోతంతో కుట్టించిన మరో బ్యాగులో పుస్తకాలు సర్దుకొని చంకన ఒక బ్యాగు, భుజాలకు మరో బ్యాగు వేసుకొని పాఠశాలకు వెళుతున్నాడు. కొత్త బ్యాగులు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్దుకు పోవాల్సి వస్తోందని కన్నారాజు తెలిపాడు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
బాపట్ల జిల్లాలో 87 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం జూన్ నెలలో స్కూల్ బ్యాగులను అందించింది. విద్యాసంవత్సరం మొదలైన నెలకే కొన్ని బ్యాగులు దెబ్బతిన్నాయి. మరికొన్నింటికి బొందులు తెగిపోగా, ఇంకొన్నింటికి జిప్పులు పాడయ్యాయి. కొన్ని బ్యాగుల కుట్లు ఊడిపోయాయి. కొన్ని ఏకంగా కుట్లు, జిప్పుల వద్ద చినిగిపోయాయి. మొత్తంగా రెండు నెలల్లోపే 90 శాతం బ్యాగులు పనికి రాకుండా పోవడంతో విద్యార్థులు కొత్త బ్యాగులు కొనాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దానిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారేగానీ నాణ్యమైనవి ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగులతోపాటు ఇతర వస్తువులను మూడంచెల తనిఖీల ద్వారా ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆర్భాటంగా ప్రకటించారు. అందులో వాస్తవం లేదని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులను చూస్తే అర్థమవుతుంది. విద్యార్థుల బూట్లు ఇతర వస్తువులు సైతం తక్కువకాలంలో పనికిరాకుండా పోయాయి. దీంతో మొత్తం కిట్ నాసిరకంగా ఉందని బాలలు వాపోతున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత హత్య
నేడు బాపట్లలో బైక్ ర్యాలీ
చంద్రబాబు సర్కారు వచ్చాక అన్ని వర్గాలకు కష్టాలు తప్పడం లేదు. చిన్నా, పెద్ద భేదం లేకుండా అందరికీ అవస్థలే. విద్యాసంవత్సరం ప్రారంభంలో పాఠశాలల్లో ఇచ్చిన బ్యాగుల దుస్థితే దీనికి నిదర్శనం. ఇచ్చిన నెలకే చినిగిపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తవి కొనడానికి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న విద్యా కానుక పేరుతో బ్యాగులతోపాటు విద్యార్థులకు దుస్తులు, బూట్లు తదితర సామగ్రి ఇచ్చారు. అవి అన్నీ స్వయంగా ఆయన పరిశీలించి నాణ్యమైనవి మాత్రమే విద్యార్థులకు ఇవ్వడంతో ఇప్పటికీ కొందరు విద్యార్థులు వాటినే వాడుతున్నారు. జగనన్న విద్యార్థులకు నాణ్యమైన వస్తువుల కిట్ ఇచ్చారని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో చదువుతోపాటు నాణ్యమైన విద్యాసామగ్రి కూడా అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దుక్కుతుందని వారు గుర్తుచేసుకున్నారు.
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాబు మాటల్లోనే బ్యాగోగులు!


