
వైభవంగా కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో కార్తిక మాస పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు, పందిళ్లు, దీపారాధన కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు అధికసంఖ్యలో జరిగాయి.