
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సీఐఎఫ్ నిధులు సక్రమంగా ఉపయోగించుకొని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు అవ్వాలని తెలిపారు. అడ్మిన్ డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ తదితర పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. సంఘ సభ్యులు బాధ్యతాయుతంగా ఉంటూ రుణాలు తిరిగి చెల్లించేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, అడిషనల్ ప్రాజెక్ట డైరెక్టర్ రాజాప్రతాప్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కోయ రజనీకుమారి, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది వాల్మీకి, శోభ, దాసు పాల్గొన్నారు.