
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్‌గా (హెచ్‌వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. పదోన్నతి కౌన్సెలింగ్‌కు 25 మంది హెచ్‌వీలను పిలువగా, వారిలో నలుగురు పదోన్నతి వద్దంటూ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో 21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సు (నాన్ టీచింగ్) నర్సుగా పదోన్నతి కల్పించి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్ ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్‌అనిల్ పాల్గొన్నారు. పదోన్నతి ఉత్తర్వులు అందించిన ఆర్డీకి వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి..
ఒంగోలు మలేరియా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరావుకు ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించి నెల్లూరు మలేరియా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరు ఆర్డీ కార్యాలయంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు.