
బాపట్ల
న్యూస్‌రీల్
చెరువు కట్టల భద్రతపై దృష్టి పెట్టండి
రూ.40 లక్షల విలువైన పురుగు మందులు సీజ్
అంకితభావంతో సేవలు అందించాలి
చీరాల టౌన్: సచివాలయాల ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని తోటవారిపాలెం గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. సచివాలయాలను, రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. దుకాణాన్ని మరో ప్రాంతానికి మార్చాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడుకు సూచించారు. తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, ఈవోఆర్డీ రామకృష్ణ, వీఆర్వో రాంబాబు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
సాగర్ నీటిమట్టం
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ప్రకాశం జిల్లాలోకి అద్దంకి !
కార్తిక పౌర్ణమికి ఏర్పాట్లు చేయాలి
కార్తిక మాసంలో సముద్ర స్నానాలకు జిల్లాకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ హాల్‌లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌తో కలసి కార్తిక పౌర్ణమికి సముద్రస్నానాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఎన్‌హెచ్ పనులు వేగవంతం చేయాలి
7
కలిపేందుకు నివేదిక సిద్ధం చేయాలని
జిల్లా కలెక్టర్‌కు సీసీఎల్‌ఏ
ముఖ్య కార్యదర్శి ఆదేశం
సాధ్యాసాధ్యాలు, సరిహద్దులపై సమగ్ర
వివరాలు కోరిన ఉన్నతాధికారులు
జిల్లాలో భారీ వర్షాల వల్ల ఇరిగేషన్ చెరువులు తెగిపోకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో భారీ వర్షాలు, ఎరువుల నిల్వలు, గృహనిర్మాణం, స్వామిత్వ సర్వే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపల వేటకు వెళ్లిన 42 మంది జాలర్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల సందర్భంగా అవసరమైన చోట పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని అధికారులకు సూచించారు.
గురజాల : రూ.40 లక్షల విలువైన పురుగు మందులు సీజ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి వై.పుల్లారెడ్డి తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం... గురజాల పట్టణంలోని నవతా ట్రాన్సుపోర్టు కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం తనిఖీ చేపట్టారు. బేయర్ కంపెనీకి చెందిన నెటివో పురుగు మందులను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గురజాలకు ట్రాన్సుపోర్టు ద్వారా బత్తుల శ్రీను పేరుతో ఇవి వచ్చినట్లు తెలిపారు. పురుగు మందుల పార్శిల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్పందన రాకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు
ఎగువ నుంచి 24,320 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 37,709 క్యూసెక్కులు అధికారులు వదులుతున్నారు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 587.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 52,560 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల