
గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి
కర్లపాలెం: గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొని గుర్తు తెలియని ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సత్యవతీపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు... కర్లపాలెం పంచాయతీ సత్యవతీపేట వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఓ మహిళను గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఆమె బలమైన గాయం కావటంతో మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలిసిన వారు కర్లపాలెం ఎస్‌ఐ జి.రవీంద్ర సెల్ నంబర్ 9440900870కు సమాచారం ఇవ్వాలని కోరారు.