
మహిళ ఉసురు తీసిన పిడుగు
దాచేపల్లి: పిడుగుపాటుకి గురై మహిళ మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో దాచేపల్లికి చెందిన యడ్ల నర్సి భార్య మాణిక్యం(55) మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి సమీపంలోని శంకరపురం దగ్గర ఉన్న పొలంలో పశువులకు మేత కోసం నర్శి, అతని భార్య మాణిక్యం వెళ్లారు. సాయంత్రం 3గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పొలంలో గడ్డి కొస్తున్న మాణిక్యంపై పిడుగుపడింది. దీంతో మాణిక్యం శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన భర్త నర్శి భయాందోళనకు గురైయ్యాడు. మృతిచెందిన భార్యని ఎడ్లబండిపై ఇంటికి తీసుకువచ్చాడు. తనతో పాటు ఉండి పిడుగుపాటుకు గురై మృతిచెందిన భార్య మాణిక్యం మృతదేహం వద్ద నర్శి ఏడుస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టిచింది. పిడుగు పాటుతో మృతిచెందిన మాణిక్యం మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మన్నెసుల్తాన్‌పాలెం గ్రామంలో మరొకరు ..
బెల్లంకొండ: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాటూరి జక్రయ్య (25) పిడుగుపడి మృతిచెందినట్లు తెలిపారు. గేదెలు మేపేందుకు పొలానికి వెళ్లిన సమయంలో వర్షం పడుతుండటంతో చెట్టుకిందకు వెళ్లాడు. ఇదే సమయంలో పిడుగు పడడంతో జక్రయ్య మృతిచెందాడు.
వడ్రంగి దుకాణాల్లో అగ్ని ప్రమాదం
రూ.20 లక్షల ఆస్తి నష్టం
నరసరావుపేట టౌన్: అగ్ని ప్రమాదంలో మూ డు వడ్రంగి దుకాణాలు దగ్ధమైన సంఘటన సో మవారం అర్థరాత్రి చోటు చేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరవకట్ట తారకరామ కాంప్లెక్స్ పక్కన షేక్ జానీబాష, ఖాశిం, సలాంలకు చెందిన వడ్రంగి దుకాణాలు వరుసగా ఉన్నాయి. ఆ దుకాణాల్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమా చారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని కలప, పరికరాలు దగ్ధమయ్యాయి. సంఘటనలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమానులు చెప్పారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ మంగళవారం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంపై అనుమానాలు ఉన్నట్లు బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్‌టీం ప్రాథమిక ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి షార్ట్‌సర్యూట్ కారణమా లేక ఇతరులు ఎవరైనా చేశారా అనే విషయం విచారణలో తేలనుందన్నారు.

మహిళ ఉసురు తీసిన పిడుగు

మహిళ ఉసురు తీసిన పిడుగు

మహిళ ఉసురు తీసిన పిడుగు