
ఆర్మీ జవానుకు అంతీమ వీడ్కోలు
బాపట్ల: ఆర్మీ జవాను ఆసోది గోపిరెడ్డి అంత్యక్రియలు బాపట్ల మండలం ఆసోదివారిపాలెంలో సైనిక లాంఛనాలతో బుధవారం నిర్వహించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపిన వివరాలు... ప్రకారం ఆసోదివారిపాలేనికి చెందిన సర్వింగ్ సోల్జర్ ఆసోది గోపిరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. గత నెల 29 బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ వెనుక వైపు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో గాయాలపాలైన గోపిరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని తెలిపారు. ఆర్మీ జవాను స్వగ్రామంలో జరిగిన అంతిమ యాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ విభాగం అధికారులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. గోపిరెడ్డికి భార్య వెంకటలక్ష్మి, కుమార్తె వినన్య, కుమారుడు దేవాన్‌న్ష్ నందన రెడ్డి ఉన్నారు.