
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
బాపట్ల: కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించనున్న ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అన్నం సతీష్‌ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కార్తిక వన సమారాధన సమయంలో అందజేస్తున్న విధంగా నే నవంబరు 16వ తేదీన పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతున్న 60 శాతం మార్కులు మించిన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, జత చేసి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో అందజేయాలని సూచించారు. వివరాలకు కె.శ్రీనివాసరావు 9346569982ను సంప్రదించాలని కోరారు.