
కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయండి
ఇంకొల్లు(చినగంజాం): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గాదె మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పావులూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలు సేకరణ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని, ప్రభుత్వం స్పందించేలా భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు. పేదవాడికి వైద్యసేవలను ఉచితంగా అందించే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణమని, మహా ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం సాధించాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, నేతలు యు. అనిల్ చౌదరి, బండి రామయ్య, అడక గంగయ్య, చందోలు ఖాదర్ బాష, అట్లూరి జయపాల్, రమేష్, దుడ్డు ప్రసన్న, రావెళ్ల అంజిబాబు, మోషే, మైలా చిన నాగేశ్వరరావు, బుజ్జి నాయక్, అహ్మద్, ములకా సుబ్బారెడ్డి, సింహాద్రి బ్రహ్మారెడ్డి, తమ్మలూరి సురేష్,అట్లూరి కృష్ణారావు పాల్గొన్నారు.