తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

Oct 13 2025 7:26 AM | Updated on Oct 13 2025 7:26 AM

తురకప

తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం వృద్ధురాలి నేత్ర దానం రేపల్లె: మండలంలోని నల్లూరుపాలేనికి చెందిన సబ్బినేని సామ్రాజ్యం (65) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. మృతి చెందిన తర్వాత తన కళ్లను దానం చేయాలని కుటుంబ సభ్యులను ఆమె కోరారు. దీంతో వారు నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవా సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ సమాచారం మేరకు శంకర్‌ కంటి ఆసుపత్రి సిబ్బంది వచ్చి సామ్రాజ్యం నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా సుదర్శి మానవతా సేవా సంస్థ ప్రతినిధి తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు చనిపోయిన 248 మంది నుంచి నేత్రాలను సేకరించి పలువురికి చూపును ప్రసాదించినట్లు తెలిపారు.

గుంటూరు రూరల్‌: రూరల్‌ మండలంలోని తురకపాలెంలో ఆకస్మిక మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం 1
1/1

తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement