అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దాదాపు 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నుంచి ఎల్‌ఐసీ బాండ్లు అందుకున్నారు. వీటి కాలపరిమితి కూడా ముగిసింది. పథకం కింద నగదు మంజూరు చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 1192 మంది దరఖాస్తులు చేసుకొన్నారు. వీరిలో పలువురు రెండేళ్ల నుంచి ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం కాల పరిమితి ముగిసిన లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ముందు ఇచ్చిన బాండ్లకు ఇంత వరకు నగదు అందలేదు. కాల పరిమితి ముగిసిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. తమకు నగదు ఇవ్వాలని పలువురు దరఖాస్తులు చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకొని న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.