దళితులపై దాడులు చేస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులు చేస్తే ఊరుకోం

Oct 1 2025 9:57 AM | Updated on Oct 1 2025 9:57 AM

దళితులపై దాడులు చేస్తే ఊరుకోం

దళితులపై దాడులు చేస్తే ఊరుకోం

దళితులపై దాడులు చేస్తే ఊరుకోం

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున సీఐ శేషగిరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

పర్చూరు(చినగంజాం): దళితులపై అన్యాయంగా దాడులు.. అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అయినా.. అధికారులైనా చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో ఇటీవల సీఐ శేషగిరి అమానుష చర్యలకు బాధితులైన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్‌ కుమార్‌తో పాటు బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో జగనన్న కాలనీ ప్రవేశంలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గ్రామ కంఠానికి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసుకునేందుకు గ్రామంలోని యువత ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. దేశంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, రాష్ట్రంలో మహనీయులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ అంబేడ్కర్‌, వంగవీటి మోహనరంగా వంటి చరిత్ర కలిగిన నాయకుల విగ్రహాలను పెట్టుకున్నామన్నారు. కానీ డేగర్లమూడిలో గ్రామ కంఠంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అనుమతి ఉన్నప్పటికీ గ్రామ కార్యదర్శి మీకు అనుమతి లేదంటూ విగ్రహాన్ని దొంగిలించుకు పోయారన్నారు. అదే ప్రాంతంలో విగ్రహాలు పెట్టకూడదని పోలీస్‌ అధికారులు ఆంక్షలు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో యాక్టివ్‌గా ఉన్న ఇద్దరు యువకులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. స్థానికంగా కొందరు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీస్‌ అధికారులను సమాయత్తం చేయడంతో వారు యువకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లి అమానుషంగా కొట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వారం రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారని.. లేని పక్షంలో 10 రోజుల్లో తామే విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని దొంగిలించిన గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ ఉమామహేశ్వర్‌ని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రజాస్వామ్యంలో విగ్రహాల ఏర్పాటుకు స్వేచ్ఛ ఉందన్నారు.

ద్రోణాదుల సర్పంచ్‌ కుటుంబానికి పరామర్శ

మార్టూరు సీఐ శేషగిరిరావు అమానుష చర్యకు బలై తీవ్రగాయాలపాలైన ద్రోణాదుల సర్పంచ్‌ వంకాయలపాటి భాగ్యారావు కుటుంబాన్ని మేరుగ నాగార్జున పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు పోపూరి వెంకట్రావు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి,ఎస్సీ విభాగం పర్చూరు నియోజకవర్గ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలెపోగు రాంబాబు, యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్‌చౌదరి, మాచవరపు రవికుమార్‌, గర్నెపూడి రవిచంద్‌, బండి రాంబాబు, జంపని వీరయ్య చౌదరి, రావూరి వేముబాబు, మువ్వల రాంబాబు, పాదర్తి ప్రకాష్‌. పఠాన్‌ కాలేష వలి, కట్టా రత్నరాజు, మైలా చిన నాగేశ్వరరావు, బూరగ రాము, గోపతోటి బాబురావు, సూరవరపు వందనం, వాసుమల్లి వాసుబాబు, కూరాకుల ఇసాక్‌ బాబు, కుమ్మరి చందు, యాతం మేరీ బాబు, పులిపాటి అరుణ్‌, జంగం మహేష్‌, గొర్రె ముచ్చు సుబ్బారావు, వల్లపునేని లక్ష్మీనారాయణ, జి.చిన్న, సురేష్‌, తమ్మలూరి సురేష్‌ బాబు, తమ్మా అమ్మిరెడ్డి, గడ్డం మస్తాన్‌ వలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement