
అన్నీ ఉచితమే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 45 కోట్లతో ప్రభుత్వ సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటైంది. ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. రూ. కోట్లు ఖరీదు చేసే అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్, ట్రాకీథెరపీ, సీటీ స్టిమ్యులేటర్, పెట్‌స్కాన్ వైద్య పరికరాలు ప్రభుత్వం అందజేసింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి సైతం ప్యాలేటీవ్ కేర్ చికిత్సలు అందిస్తున్నాం. మందులు కూడా ఉచితంగా అందించి రోగుల్లో మనోధైర్యం కల్పిస్తున్నాం. మరో వంద పడకలతో క్యాన్సర్ సెంటర్‌ను నిర్మాణం చేస్తున్నాం.
– నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్