
క్రీడాపోటీల బ్రోచర్ ఆవిష్కరణ
చీరాల టౌన్: రెవెన్యూ అసోసియేషన్ బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో బాపట్లలో జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడాపోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. క్రీడల్లో చీరాల డివిజన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం తమ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ చీరాల డివిజన్ అధ్యక్షుడు, తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణతో కలసి ఆయన బ్రోచర్ ఆవిష్కరించారు. నిత్యం పని ఒత్తిడి ఉండే రెవెన్యూ ఉద్యోగులకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీలను కలెక్టర్ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సురేష్‌బాబు, డివిజన్ కార్యదర్శి పీకా సురేష్, జిల్లా క్రీడల కార్యదర్శి డి.అర్జున్, ప్రతినిధులు సత్యనారాయణ, ఆదినారాయణ, సీహెచ్ రమేష్, తేజ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.