
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారు మంగళవారం భక్తులకు మాంగల్య గౌరి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పసుపుకుంకుమలు సమర్పించారు. వివాహ దోష నివారణ పూజలలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గౌరి, మహా చండీ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. – కర్లపాలెం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన జిల్లెళ్ళమూడి గ్రామంలోని అనసూయ దేవి (జిల్లెళ్ళమూడి అమ్మ వారు) దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాల త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పరిసర గ్రామాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఏర్పాట్లను కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. – బాపట్ల టౌన్

కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు