
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలు
బల్లికురవ: మినీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 9 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం నార్కెట్‌పల్లి– మేదరమెట్ల నామ్ రహదారిలో కొప్పరపాడు గ్రామ శివాలయం సమీపాన జరిగింది. అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామానికి చెందిన చింతంరెడ్డి అంకిరెడ్డి తన కుమారుడి పుట్టెంట్రుకలు తీయించేందుకు పల్నాడు జిల్లా అడిగొప్పుల అమ్మవారి సన్నిధానానికి 20 మందితో కలిసి వాహనంలో వెళ్లారు. తిరిగి వస్తుండగా కొప్పరపాడు గ్రామ సమీపంలోని చేపల చెరువుల నుంచి వస్తున్న లారీ రోడ్డు క్రాస్ చేస్తూ వ్యాన్‌ను ఢీకొట్టింది. జయరామిరెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకరరెడ్డి, పేరమ్మ, వెంకటేశ్వరరెడ్డి, అంజిరెడ్డి, మాగంటి రామాంజనేయులు, మిర్యాల సీతారామయ్య తదితరులు గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.