
స్వీయ జాగ్రత్తలే రక్ష
ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్‌లో అనవసరమైన లింక్‌లపై క్లిక్ చేసి మోసపోవద్దు. ప్రస్తుత యువత ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి అవసరాల కోసం లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎంతటి ఆర్థిక అవసరమైనా యాప్‌ల ద్వారా లోన్ తీసుకోకూడదు. తల్లిదండ్రులకు తెలియకుండా యాప్‌లను ఆశ్రయిస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక వేళ లోన్ యాప్‌లో ఇప్పటికే తీసుకున్న బాధితులుంటే 1930 సహాయక నంబరుకు ఫిర్యాదు చేయాలి. వారి సూచనలతో సంబంధిత పోలీసులను సంప్రదించాలి.
– వినోద్‌బాబు, ఎస్సై, రేణింగవరం