
కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘీయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేసి ఈశ్వర్ తెలిపారు. పాలపాడురోడ్డులోని కల్యాణ మండపంలో ఆదివారం పల్నాడు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షునిగా తొర్లకొండ చినఅంజయ్య, కార్యదర్శిగా వీరబ్రహ్మంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా యూత్ అధ్యక్షునిగా బాడిశ మస్తాన్‌రావు (పిడుగురాళ్ల) నియమితులయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఐలాపురం భాస్కర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, సంఘం నాయకులు టి.మంగమ్మ, రంగయ్య, బి.రోశయ్య, సిహెచ్.వెంకటఅప్పారావు తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు చినఅంజయ్య మాట్లాడుతూ త్వరలో జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.