
సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లి విద్యార్
సత్తెనపల్లి: సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30,31న జరిగిన సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లికి చెందిన షికోకాయ్ షిటోరియో కరాటే ఇనిస్టిట్యూట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ చూపి ఐదు గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్‌ను కై వసం చేసుకుని సత్తెనపల్లి పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చినట్లు కరాటే మాస్టర్ అనుముల రామయ్య ఆదివారం తెలిపారు. బాలికల కటా విభాగంలో బి అక్షయ్‌రెడ్డి గోల్డ్ మెడల్, బాలుర కటా విభాగంలో బి.టిష్యంత్, ఎంవీ.బాలాజీ, ఎల్ కిరీట్, ఎల్ గెష్ణ్‌ఆషిత్‌లు గోల్డ్‌మెడల్స్ సాధించగా .. బి.సత్యనారాయణ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ప్రతిభ చూపిన విద్యార్థులను అకాడమీ ఆర్గనైజర్ ఏ.వీరబ్రహ్మం, అడ్వైజర్ ఏ.రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు.