
నిమజ్జనం వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్
శావల్యాపురం: వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకల్లో పోలీసు నిబంధనలు అందరూ పాటించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జి.సంతోష్ అన్నారు. ఆదివారం మండలంలోని పొట్లూరు, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకలు సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో శావల్యాపురం, బొల్లాపల్లి, నూజెండ్ల మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించామన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం సమయంలో శాంతిభద్రతలు విఘాతం కల్గుకుండా ఉండటానికి ముందుస్తులో భాగంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలుగా ఉండే వాటిపై ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంచామన్నారు. ఐదో రోజు నరసరావుపేట డివిజన్ 397 విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కమిటీ సభ్యులను బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని విగ్రహాలు నిమజ్జనం చేసే ఏరియాను పరిశీలించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఆయనతోపాటు సీఐ గోపి, ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు, ఎస్‌బి కానిస్టేబుల్ రమేష్, స్టేషన్ రైటరు బాషా పాల్గొన్నారు.