ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు

Aug 30 2025 7:38 AM | Updated on Aug 30 2025 7:58 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌ రీజినల్‌ ఆఫీస్‌ జనరల్‌ మేనేజర్‌ మహానా

వేటపాలెం: ప్రజలందరికీ ఆర్థిక సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భారతీయ రిజర్వ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌ రీజనల్‌ ఆఫీస్‌ జనరల్‌ మేనేజర్‌ మహానా పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మూడు నెలల ఆర్థిక కేంద్ర ప్రయత్న శిబిరం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం బ్యాంక్‌ ఖాతా, డిజిటల్‌ లావాదేవీలు, బీమా, పెన్షన్‌, రుణ సౌకర్యాలు పొందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డిజటల్‌ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలిపారు. క్రెడిట్‌ విభాగం చీఫ్‌ మేనేజర్‌ ఎం. సంపత్‌, పైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ నోడల్‌ ఆఫీసర్‌ మహేంద్ర, వెలుగు సీసీలు, యానిమేటర్లు పాల్గొన్నారు.

గొర్రెలను ఢీ కొన్న లారీ

రెండు మృతి.. మరికొన్నింటికి గాయాలు

మేదరమెట్ల: లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో .. లారీని గొర్రెల మందపైకి నడపడంతో రెండు గొర్రెలు మృతి చెందగా మరో పది గొర్రెలకు కాళ్లు విరిగినట్లు బాధితుడు తెలిపాడు. హైదరాబాద్‌ నుంచి చైన్నెకు వెళుతున్న లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో రోడ్డు మార్జిన్‌లో వెళుతున్న గొర్రెల మందపైకి నడిపాడు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల పోలీసు స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. మొత్తం రూ.2.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటరామయ్య తెలిపారు.

చింతాయపాలెం పాఠశాలకు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

కర్లపాలెం: మండల పరిధిలోని చింతాయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 2024–25 సంవత్సరానికి స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికై ంది. చింతాయపాలెం పాఠశాల విద్యార్థులు 2024–25 సంవత్సరంలో సుమారు 50 మంది రాష్ట్రస్థాయిలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాపట్ల విద్యాశాఖ కార్యాలయంలో చింతాయపాలెం పీఈటీ ఎం గోపీని డీఈవో ఎస్‌ పురుషోత్తం శాలువా కప్పి మెమోంటో అందజేసి సన్మానం చేశారు. పీఈటీ గోపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు క్రమ శిక్షణతో ఆటలు ఆడి విజేతలుగా నిలవటం వలన పాఠశాలకు అవార్డు వచ్చిందని తెలిపారు. అవార్డు అందుకున్న పీఈటీ గోపీని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

ఏఎన్‌యూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూన్‌, జూలై నెలల్లో నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు శుక్రవారం విడుదల చేశారు. 5,454 మంది పరీక్షలు రాయగా 4,292 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌కు సెప్టెంబరు 12లోగా ఒక్కో పేవర్‌కు రూ.1,490 చెల్లించాలని ఏసీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. రెక్టార్‌ ఆచార్య కె రత్నషీలామణి, రిజిస్ట్రార్‌ ఆచార్య సింహాచలం, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య ఎన్‌వీ కృష్ణారావు, ఎ.రాధాకృష్ణ, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌రెడ్డి, సీఈ శివప్రసాదరావు, నోడల్‌ ఆఫీసర్‌ రెడ్డి ప్రకాశరావు, ఏఆర్‌బీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు 1
1/2

ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు

ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు 2
2/2

ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement