
రెండు టన్నుల శివ లింగాకారంలో ప్రసాదం
తెనాలిరూరల్: వినాయక చవితి వేడుకల్లో భాగంగా భక్తులు తెనాలిలో శివ లింగాకారంలో ప్రసాదం తయారు చేయించారు. విశాఖపట్నం గాజువాకలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీ సుదర వస్త్ర మహా గణపతి కమిటీ సభ్యులు తెనాలిలోని మిర్చి స్నాక్స్‌లో భారీ లడ్డూ ప్రసాదం చేయించాలని నిర్ణయించారు. ఇందుకు మిర్చి స్నాక్స్ నిర్వాహకుడు వి.కిషోర్ అంగీకరించి రెండు టన్నుల శివలింగాకార లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని శుక్రవారం రాత్రి ఇక్కడ నుంచి గాజువాకకు తరలించారు.
91 మందికి ఉద్యోగ కల్పన
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి – శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని సీఆర్‌డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. 300కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించగా 301 మంది హాజరయ్యారు. వీరిలో 91 మందికి ఉద్యోగాలు లభించాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న పలువురు అభ్యర్థులకు ఆయా కంపెనీల హెచ్‌ఆర్ విభాగ ప్రతినిధులతో కలసి సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆఫర్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ప్లేస్‌మెంట్ అధికారి అరుణ కుమారి, సీఆర్‌డీఏ డీసీడీవోఓ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రెండు టన్నుల శివ లింగాకారంలో ప్రసాదం