తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు | - | Sakshi
Sakshi News home page

తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు

Aug 29 2025 2:36 AM | Updated on Aug 29 2025 2:36 AM

తెగి

తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు

తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలో హై ఓల్టేజీ విద్యుత్‌ వైరు బుధవారం రాత్రి తెగి గృహాలకు విధ్యుత్‌ సరఫరా చేసే స్తంభాలపై పడింది. దీంతో ఆ ప్రాంతంలోని గృహాలకు హై ఓట్టేజీ సరఫరా కావడంతో విద్యుత్‌ మీటర్లు, ఫ్రిజ్‌లు, మోటార్లు, ఫ్లాన్లు, టీవీలు కాలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేపాల్‌ కాలనీలోని గృహాల మధ్య నుంచి హై టెన్షన్‌ విధ్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. వర్షాలు కురిన సమయంలో ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇళ్ల మధ్య నుంచి వెళుతున్న హై టెన్షన్‌ లైన్‌ను తొలగించి దూరంగా వేయాలని కోరుతున్నారు. వైఎస్సార్‌ సీపీలో నియామకాలు పశ్చిమ డెల్టాకు 5,007 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం 5,007 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12.5 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కు138, బ్యాంక్‌ కెనాల్‌ 1,241, తూర్పు కాలువకు 547, పశ్చిమ కాలువకు 229, నిజాప ట్నం కాలువకు 428, కొమ్మూరు కాలువకు 1,760 క్యూసెక్కులు విడుదల చేశారు. 4,16,622 క్యూసెక్కులు సముద్రంలోకి పంపుతున్నారు. నేడు జీజీహెచ్‌ మెడికల్‌ బోర్డులో పరీక్షలు

చుండూరు (కొల్లూరు): వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వలంటీర్‌ వింగ్‌ సెక్రటరీగా చుండూరు మండలం చిన్నగాదెలవర్రుకు చెందిన గాదెలవర్తి సుధీర్‌ను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా కొల్లూరు మండల మాజీ ఎంపీపీ పెరికల పద్మారావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు గురువారం వెలువడ్డాయి.

గుంటూరు ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–2025 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఈనెల 29న జీజీహెచ్‌ మెడికల్‌ బోర్డులో పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వైకల్య నిర్ధారణ పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌ మెడికల్‌ బోర్డుకు రూ.1500 చెల్లించాలని సూచించారు.

తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు 
1
1/1

తెగి పడిన హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement