తీర గ్రామాలకు మళ్లీ వరద ముప్పు
తీర గ్రామాలకు మళ్లీ వరద ముప్పు రేపల్లె: ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీరు దిగువకు వదులుతుండడంతో లంక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన పెనుమూడి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన పెనుమూడి, పెనుమూడి పల్లిపాలెం, రావి అనంతవరం గ్రామాలలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పరీవాహక గ్రామాలలో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూ మ్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఏదైనా సహాయం కోసం 77948 94544ను సంప్రదించాలని తెలియజేశారు. ఆయన వెంట వీఆర్వోలు పాల్గొన్నారు. భట్టిప్రోలు: ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు వరద నీరు విడుదల చేసినందున ఉధృతి పెరుగుతుందని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరుతోపాటు నది పరీవాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొల్లూరు: మండలంలోని చింతర్లంక, పోతార్లంక ప్రాంతాల్లోని పొలాల్లోకి తిరిగి వరద నీరు చేరుతుంది. దోనేపూడి కరకట్ట దిగువున లోలెవల్ వంతె నపైకి వరనీరు చేరే సూచనలు ఉండడంతో ఈ మార్గంలోని పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారి పాలెం, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికల పూడి గ్రామాల ప్రజలు మండలంలోని గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు మీదుగా చుట్టు మార్గంలో రాకపోకలు సాగించాల్చి వస్తుంది. వరద తీవ్రత పెరిగితే పంటలకు నష్టం వాటిల్లుతుందన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
1/1
తీర గ్రామాలకు మళ్లీ వరద ముప్పు