
ఏఆర్ కానిస్టేబుల్
ఆత్మహత్యాయత్నం వీడియో కలకలం
మాచర్ల రూరల్: మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్ ఆత్మహత్యాయత్నం వీడియో మంగళవారం కలకలం సృష్టించింది. వీడియో వివరాలు ఇలాఉన్నాయి..న్య.. తన వద్ద ఓ మహిళ రూ. లక్ష, ఆ తరువాత రూ. 75వేలు తీసుకుందని, ఆ డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే ఆమె, ఆమె భర్త తన పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వీడియోలో వాపోయాడు. తన భార్యకు అన్యాయం చేసి ఈ మహిళ విషయంలో సన్నిహితంగా ఉండి కుటుంబాన్ని దూరం చేసుకున్నానని సదరు కానిస్టేబుల్ వాపోయాడు. ఆ యువతితో తనకు వివాహేతర సంబంధం ఉందని, తమకు ఒక బిడ్డ కూడా ఉందని చెప్పాడు. పట్టణ శివారులోని ఎంఎస్‌ఆర్ టౌన్ షిప్‌లో నివాసముంటున్నామని వీడియోలో పేర్కొ న్నాడు. తన తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారంటూ మాయమాటలు చెప్పి ఆమె తనకు దగ్గరైనట్లు వీడియోలో వెల్లడించాడు. నగదు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో తనపై డీఎస్పీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందని, ఈ నేపథ్యంలో తనకు ఆత్మహత్యే శరణ్యమని, తన చావుకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నా తల్లిదండ్రుల చావుకు కూడా వారిదే బాధ్యతని వాపోయాడు. తను చనిపోయాక తన శవాన్ని భార్య, పిల్లలు చూడాలని కోరాడు.
మహిళ చేతిలో మోసపోయానని,
ఆత్మహత్యే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో