
స్వార్థానికి కూలుతున్న మహా వృక్షాలు
కొల్లూరు: దశాబ్దాల చరిత్ర ఉన్న మహావృక్షాలు రంపపు కోతకు గురై నేలకొరిగాయి. కొల్లూరు పశ్చిమ బ్యాంక్ కెనాల్ అంచుల వెంబడి పెరిగిన భారీ వృక్షాలు కొందరి స్వార్థానికి మనుగడ కోల్పోయాయి. కొల్లూరు–ఈపూరు మార్గంలో కాలువ అంచుల వెంబడి ఉన్న భారీ వృక్షాలలో ఓ వృక్షం ఇటీవల వీచిన పెనుగాలులకు కూలి కాలువలోకి వాలిపోయింది. ఆ వృక్షాన్ని తొలగించే పేరుతో సజీవంగా ఉన్న వృక్షాలను సైతం కోసి కలపగా మార్చి ట్రాక్టర్లలో తరలించడం విమర్శలకు దారితీస్తుంది. కూలిన వృక్షాన్ని తొలగించడానికి అయ్యే ఖర్చుల కోసం సజీవంగా ఉన్న వృక్షాలను కూల్చడానికి నీటిపారుదల శాఖ అధికారులు తెగించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే భారీ చెట్ల నరికివేతలో నగదు లావాదేవీలు భారీగా జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్వార్థానికి కూలుతున్న మహా వృక్షాలు