
విద్యా పురోగతికి ఉపాధ్యాయుల కృషి కీలకం
చీరాల అర్బన్: ప్రత్యేక అవసరాల పిల్లల విద్యా పురోగతికి సహిత విద్య ఉపాధ్యాయులు కృషి చేయాలని సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న పేర్కొన్నారు. సోమవారం ఆమె ఈపురుపాలెంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి పిల్లల విద్యా ఉన్నతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యా పురోగతికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ, హియరింగ్, విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రానికి తీసుకువచ్చేలా తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో భావానారుషిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం హేమంత్‌కుమార్, ఐఈఆర్టీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న