
పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు చేయూతనివ్వాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ట్యుటోరియల్స్‌లో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ ఉద్యమ అధ్యయన తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపుతూ వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చాంద్‌బాషా, నాయకులు రాజారత్నం, సుబ్బారావు, హరిప్రసాద్,ౖ వె నేతాంజనేయప్రసాద్, వై చెన్నకేశవులు, డి.మల్లికార్జునరావు, కే వెంకటరత్నం, ఎంవీవీ సత్యనారాయణ, ఎం రాంబాబు, పి.శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోషలిజం