
నాగిరెడ్డికి మదర్ థెరెస్సా జాతీయ పురస్కారం
కారంచేడు: మండలంలోని యర్రంవారిపాలెం గ్రామానికి చెందిన మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మున్నంగి నాగిరెడ్డికి మదర్ థెరెస్సా జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఆర్‌సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. మదర్ థెరెస్సా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దిండ్ల కిషోర్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తమ ట్రస్ట్ ద్వారా చేసిన అనేక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారని పేర్కొన్నారు. 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రదర్శించామన్నారు. సీఆర్‌సీ వ్యవస్థాపక అధ్యక్షుడు విక్టరీ వెంకటరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణమ్మ, శివకుమార్, చంద్ర సుబ్బారెడ్డి, నరేష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ వడియార్, వీరరాఘవరెడ్డి చేతుల మీదుగా తనకు అవార్డును అందించామని నాగిరెడ్డి తెలిపారు.