
కొప్పుల కోటయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ
నగరం: మండలంలోని సజ్జావారిపాలెం శివారు అల్లపర్రు అగ్రహారానికి చెందిన కొప్పుల కోటయ్య కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్‌లు పరామర్శించారు. ఇటీవల కోటయ్య మృతిచెండటంతో పెదకర్మ కార్యక్రమం అల్లపర్రు అగ్రహారంలో సోమవారం నిర్వహించారు. తొలుత కోటయ్య చిత్రపటానికి మేరుగ నాగార్జున, గణేష్‌లు పూలు వేసి నివాళులర్పించారు. నగరం, రేపల్లె, చెరుకుపల్లి మండలాల కన్వీనర్‌లు ఇంకోల్లు రామకృష్ణ, కరేటి శేషగిరిరావు, దుండి వెంకటరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, కృష్ణారెడ్డి, నాయకులు యార్లగడ్డ మదన్‌మోహన్, డాక్టర్ రాజా, వీరేంద్ర, ఖాతర్ వలి, చిమటా బాలాజీ పాల్గొన్నారు.