
ధూర్జటిది విశిష్ట స్థానం
వారణాశి రఘురామ శర్మ
అద్దంకి: అష్ట దిగ్గజాల్లో ధూర్జటిది విశిష్ట స్థానమని వారణాశి రఘురామశ శర్మ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కమఠ్వేర స్వామి దేవస్థానంలో సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన వహించారు. మలాది శ్రీనివాసరావు జ్యోతిప్రజ్వలన చేశారు. ‘ధూర్జటి మహాకవి భక్తితత్త్వం’ అనే అంశంపైన శ్రీ వారణాశి రఘురామశర్మ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నాటి రాజులను ఈసడిరచుకున్న కవిరాజు ధూర్జటి అని చెప్పారు. సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు.. శివుని సేవించి మోక్షం పొందిన కథలను రసరమ్యంగా శ్రీ కాళహస్తీశ్వరమహాత్మ్య కావ్యంలో ధూర్జటి ఆవిష్కరించారన్నారు. ఆ పద్యాలన్నీ ధూర్జటి హృదయాన్ని ఆవిష్కరిస్తాయని, అతని ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని శర్మ పేర్కొన్నారు. రోటరీ తాజా మాజీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి సుధాకరరావు, శ్రీ మలాది శ్రీనివాసరావులను, అసిస్టెంట్ గవర్నర్‌గా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన షేక్ మహమ్మద్ రఫీని సత్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి రోటరీక్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కార్యవర్గంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గాన్ని సత్కరించారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ సభాహ్వానం చేయగా అద్దంకి లేవిప్రసాద్ వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో యు.దేవపాలన, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గాడేపల్లి దివాకర దత్, కె.అనిలకుమారసూరి, సంకా సుబ్రహ్మణ్యం(బాబు), అనంతు నాగేశ్వరరావు, అద్దంకి లేవిప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.