
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడమటి బిక్షాలు కోరారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు, పార్క్ కూలీలకు, ఆఫీసు సిబ్బందికి, టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీఓ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. అవుట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో, మృతి చెందిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శివప్రసాద్ హామీ ఇచ్చారు. సింగం వాణిశ్రీ పాల్గొన్నారు.
పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం వద్దు
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఈ మేరకు ఈనెల 7వ తేదీన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు యల్లావుల సోహిత్ యాదవ్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు కాటి లక్ష్మణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ పర్వే జ్, రేపల్లె అధ్యక్షులు వసీం మొహమ్మద్, చీరాల అధ్యక్షులు గోనబోయిన వెంకటేష్, జిల్లా విద్యార్థి యువ నాయకులు చోప్రా రాజశేఖర్ ఉన్నారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి