
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
ఎడిటర్లపై దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పత్రిక ఎడిటర్ గృహంలో పోలీసు సోదాలు దౌర్జన్యంతో సమానం. ఇది మిగిలిన పత్రిక విలేకరుల ను భయపెట్టేందుకే. ఇటువంటివి జరిగినప్పుడు ప్రతి పత్రికకు చెందిన విలేకరులు అండగా ఉండాలి. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి. ఇదే పరంపర కొనసాగితే ప్రశ్నించే గొంతుకలు మూగబోతాయి. జర్నలిస్టులు నిబ్బరం కోల్పోకుండా తమ విధులను నిర్వహించాలి.
–నల్లపాటి రామారావు , రాష్ట్ర నాయకులు,
దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం), నరసరావుపేట.
ప్రజల గొంతులను నొక్కడానికే...
ఇది ప్రజాస్వామ్యంపై దాడి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుందనే దానికి ఉదాహరణ. సమాజంలో చెడును ప్రశ్నించగలిగే ఒక పత్రిక ఎడిటర్‌పై అనుచితంగా ప్రవర్తించి మీరు కూడా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందంటూ ముందస్తుగా సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటమే. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలే శాశ్వతమనే విషయం పోలీసులు తెలుసుకోవాలి.
–షేక్ మౌలాలి, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు, నరసరావుపేట
ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్కసు
పత్రికలు, అందులో పనిచేసే వారిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చలాంటివి. ఒక పార్టీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రభుత్వం మరోసారి రావొచ్చు. పోలీసులు నిత్యం అన్ని ప్రభుత్వాలలో పని చేయాల్సిన వ్యక్తులు. తమ వ్యవస్థను తామే దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపి వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడే ఉద్యమంలో అందరూ కలసి రావాలి. – డాక్టర్ కె.శ్రీనివాసరెడ్డి,
వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షులు, పల్నాడు జిల్లా.
న్యూస్‌రీల్

శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025

శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025