కానిస్టేబుల్‌ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అదృశ్యం

Apr 15 2025 1:34 AM | Updated on Apr 15 2025 1:34 AM

కానిస

కానిస్టేబుల్‌ అదృశ్యం

మంగళగిరి టౌన్‌: కానిస్టేబుల్‌ అదృశ్యంపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా ఫారుఖ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని టిప్పర్ల బజార్‌లో గత కొంతకాలంగా కుటుంబంతో కలసి ఉంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు. వైజాగ్‌లో ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ ఉందంటూ ఫారుక్‌ ఈ నెల 8వ తేదీన బయలుదేరి వెళ్లాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో భర్తకు ఫోన్‌ చేశానని, ఆ సమయంలో వైజాగ్‌లోనే ఉన్నానని చెప్పినట్లు బషీరున్‌ ఫిర్యాదులో పేర్కొంది. 10వ తేదీ ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. మళ్లీ రెండు రోజుల తరువాత ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఫారుఖ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు 12వ తేదీన మంగళగిరి చేరుకుని నగరంలోని ఆక్టోపస్‌ కార్యాలయానికి బషీరున్‌ను తీసుకుని వెళ్లారు. ఆక్టోపస్‌ కార్యాలయంలో అధికారులకు జరిగిన విషయం చెప్పడంతో ఫారుఖ్‌ ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు సెలవు పెట్టి ఉన్నాడని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తప్పిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని ఏల్చూరులో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకుల బాలికా విద్యాలయ్యాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు పద్మావతి సోమవారం సందర్శించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థినులకు అంబేడ్కర్‌ చరిత్ర గురించి విరించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధన చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. బాలల హక్కుల గురించి వివరించారు. పదో తరగతి పాసైన విద్యార్థినులకు కేజీబీవీలోనే ప్రవేశాలు కల్పించే విధంగా సమగ్ర శిక్ష, విద్యాశాఖను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి

చీరాల అర్బన్‌: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సిబ్బంది అగ్నిమాపక పతాకానికి గౌరవ వందనం చేశారు. అగ్నిమాపక శాఖలో పనిచేసి అమరులైన సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. చిన్న చిన్న అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి వాటిని నివారించవచ్చన్నారు. సరైన అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వచ్చే సమయంలోగా ప్రాథమికంగా ప్రజలే స్వయంగా మంటలు అదుపుచేసేందుకు పలు రకాల చర్యలు చేపట్టాలన్నారు. 1944 ఏప్రిల్‌ 14న ముంబైలోని దాల్‌ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో 336 మందితోపాటు 66 మంది సిబ్బంది కూడా మరణించారని, వారి స్మతికి చిహ్నంగా ఏప్రిల్‌ 14వ నుంచి 20వ తేదీ వరకు దేశమంతటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ అదృశ్యం 1
1/2

కానిస్టేబుల్‌ అదృశ్యం

కానిస్టేబుల్‌ అదృశ్యం 2
2/2

కానిస్టేబుల్‌ అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement