సొంత రాజ్యాంగం ‘పులి’మేసి! | - | Sakshi
Sakshi News home page

సొంత రాజ్యాంగం ‘పులి’మేసి!

Mar 26 2025 1:41 AM | Updated on Mar 26 2025 1:37 AM

● మున్సిపల్‌ చట్టాలకు తూట్లు ● కమిషనర్‌ పులి శ్రీనివాసులు తీరుపై వైఎస్సార్‌ సీపీ సభ్యుల ధ్వజం ● మేయర్‌ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్‌ నిర్వహణ ! ● అసలు రాజీనామా ఫార్మెటే సరికాదు ● వైఎస్సార్‌ సీపీ సభ్యుల వాకౌట్‌ ● మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్‌ రాజీనామా ఆమోదం

నెహ్రూనగర్‌ (గుంటూరుఈస్ట్‌): గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు రాజీనామాపై మున్సిపల్‌ చట్టాలను కాదని కమిషనర్‌ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌ బాబు) దుయ్యబట్టారు. ఈనెల 15న నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేసి కలెక్టర్‌కు పంపిన విషయం తెలిసిందే. మేయర్‌ రాజీనామా ఆమోదం కోసం మంగళవారం కౌన్సిల్‌ హాల్‌లో అత్యవసర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ముందుగా తాత్కాలిక మేయర్‌గా షేక్‌ సజీల తన నియామకానికి కారణమైన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తరువాత మేయర్‌ రాజీనామా ఆమోదానికి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయాలని సజీల కోరారు. వెంటనే డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపితే.. ఆ లేఖ ఆధారంగా కౌన్సిల్‌ ఏ విధంగా నిర్వహిస్తారు? అసలు కలెక్టర్‌ నగరపాలక సంస్థకు మేయర్‌ రాజీనామాపై ఏమని రాశారో చెప్పాలని సెక్రటరీని కోరారు.

మౌనం వహించిన సెక్రటరీ

డెప్యూటీ మేయర్‌ అడిగిన ప్రశ్నపై కౌన్సిల్‌ సెక్రటరీ మౌనం వహించారు. కమిషనర్‌ అందుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈనెల 15న మేయర్‌ పదవికి మనోహర్‌ రాజీనామా చేస్తూ లేఖ ను మెయిల్‌ ద్వారా కలెక్టర్‌కు, కమిషనర్‌కు పంపా రని, దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారని కమిషనర్‌ వివరించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మేయర్‌ రాజీనామాపై అత్యవసర కౌన్సిల్‌ నిర్వహణకు ఉన్న ఇద్దరు డెప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి, ఎంఏయూడీ శాఖకు లేఖ రాశామని, ఈనెల 21న డెప్యూ టీ మేయర్‌షేక్‌ సజీలను తాత్కాలిక మేయర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో మంగళవారం అత్యవసర కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

రాజీనామా చేసిన ఫార్మెట్‌ సరైనది కాదు

మున్సిపల్‌ చట్టం 92 (1) మేయర్‌ తన పదవికి రాజీనామా చేయాలంటే కౌన్సిల్‌ నిర్వహించి కౌన్సిల్‌లో రాజీనామాకు గల కారణాలను చర్చించిన తరువాత సభ్యుల ఆమోదంతో రాజీనామాను ఆమోదించాలి. లేదా కౌన్సిల్‌ సెక్రటరీకి రాజీనామా ను పంపితే ఆ రాజీనామాకు అనుగుణంగా సెక్రటరీ అత్యవసర కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నగర కమిషనర్‌ కలెక్టర్‌కు పంపిన రాజీనామాను ఆధారం చేసుకుని తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేసి ప్రభుత్వానికి లేఖ రాయడమేమిటని వజ్రబాబు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై తాము లీగల్‌ ఓపీనీయన్‌న్‌ తీసుకుంటామని..అప్పటి వరకు మేయర్‌ రాజీనామా ఆమోదం కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిల్‌ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ నుంచి వైఎస్సార్‌ సీపీ సభ్యు లు వాకౌట్‌ చేశారు. తాత్కాలిక మేయర్‌ షేక్‌ సజీల మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్‌ కావటి మనోహర్‌ రాజీనామాను ఆమోదించారు.

అధికారపార్టీకి కమిషనర్‌ కొమ్ముకాస్తున్నారు మున్సిపల్‌ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మేయర్‌ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపడం ఆమోదయోగ్యం కాదు డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement